దీపిక–జోష్నా జంటకు కాంస్య పతకం | Bronze medal for Deepika and Joshna | Sakshi
Sakshi News home page

దీపిక–జోష్నా జంటకు కాంస్య పతకం

Aug 5 2017 12:31 AM | Updated on Sep 17 2017 5:10 PM

దీపిక–జోష్నా జంటకు కాంస్య పతకం

దీపిక–జోష్నా జంటకు కాంస్య పతకం

ప్రపంచ డబుల్స్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌ విభాగంలో దీపిక పళ్లికల్‌–జోష్నా చినప్ప

న్యూఢిల్లీ: ప్రపంచ డబుల్స్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌ మహిళల డబుల్స్‌ విభాగంలో దీపిక పళ్లికల్‌–జోష్నా చినప్ప (భారత్‌) జంట పోరాటం ముగిసింది. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన సెమీఫైనల్లో దీపిక–జోష్నా ద్వయం 11–6, 6–11, 8–11తో జెన్నీ డన్‌కాఫ్‌–అలీసన్‌ వాటర్స్‌ (ఇంగ్లండ్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.

దాంతో ఈ భారత జంటకు కాంస్య పతకం లభించింది. అంతకుముందు క్వార్టర్‌ ఫైనల్లో దీపిక–జోష్నా 10–11, 11–6, 11–8తో సమంత కార్నెట్‌–నికోల్‌ టాడ్‌
(కెనడా)లపై గెలిచారు. 

Advertisement
 
Advertisement
Advertisement