ఇద్దర్నీ ఒకేసారి పెళ్లాడటం లేదు.. | Brazil Great Ronaldinho Denies Reports He Will Marry Two Women At Once | Sakshi
Sakshi News home page

ఇద్దర్నీ ఒకేసారి పెళ్లాడటం లేదు..

May 25 2018 6:10 PM | Updated on Oct 2 2018 8:39 PM

Brazil Great Ronaldinho Denies Reports He Will Marry Two Women At Once - Sakshi

గర్ల్‌ఫ్రెండ్స్‌తో బ్రెజిల్‌ మాజీ స్టార్‌ ఫుట్‌బాలర్‌ రొనాల్డిన్హో

రియో డీ జనిరో :  బ్రెజిల్‌ మాజీ ఫుట్‌బాల్‌ స్టార్‌ రొనాల్డిన్హో ఒకేసారి ఇద్దరు మహిళలను వివాహం చేసుకోనున్నాడని వచ్చిన వార్తలను తోసిపుచ్చాడు. ఇది అతిపెద్ద అవాస్తవమని పేర్కొన్నాడు. రియో డీ జనిరోలోని తన నివాసంలో ఆగస్టులో రొనాల్డిన్హో (38) ఒకేసారి ఇద్దరు మగువలను పెళ్లాడనున్నాడని ఊహాగానాలు చెలరేగాయి. కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న తన గర్ల్‌ఫ్రెండ్స్‌ ప్రిసిల్లా, బేట్రియాజ్‌లను రొనాల్డిన్హో వివాహం చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై రొనాల్డిన్హో సోదరి కినుక వహిస్తూ తాను వివాహానికి హాజరు కాబోనని చెప్పారు.

ఇక ప్రిసిల్లా కుటుంబం కూడా వేరే కారణాలతో వీరి వివాహంపై సుముఖంగా లేరని కథనాలు వెలువడ్డాయి. ప్రిసిల్లాకు విలువైన బహుమతి ఇచ్చినప్పుడల్లా మరో యువతికి కూడా కానుకలిచ్చేవాడని వారు చెబుతున్నారు. ఇక బ్రెజిల్‌లో బహుభార్యత్వంపై నిషేధం ఉండటంతో రొనాల్డిన్హో ఈ వార్తలను తోసిపుచ్చాడని భావిస్తున్నారు.

1998లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేసిన రోనాల్డిన్హో.. సొంత దేశం బ్రెజిల్‌ తరపున 97 మ్యాచ్‌లు ఆడి 33 గోల్స్‌ చేశాడు. 2002లో బ్రెజిల్‌కు వరల్డ్‌ కప్‌ దక్కటంలో రోనాల్డిన్హోదే కీలక పాత్ర. తర్వాత బార్సిలోనా తరపున 2003 నుంచి 2008 వరకు ఆడాడు. గతేడాది భారత్‌లో నిర్వహించిన ప్రీమియర్‌ ఫుట్‌ సాల్‌ లీగ్‌లో ఢిల్లీ డ్రాగన్స్‌ తరపున రోనాల్డిన్హో ఆడాడు. ఈ ఏడాది జనవరిలో సోదరుడి ద్వారా రోనాల్డిన్హో రిటైర్‌మెంట్‌ ప్రకటన చేయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement