హెచ్‌ఐఎల్ డైరెక్టర్‌గా ఐస్‌బెర్గ్ | Bjorn Isberg was appointed as tournament director. hil | Sakshi
Sakshi News home page

హెచ్‌ఐఎల్ డైరెక్టర్‌గా ఐస్‌బెర్గ్

Dec 31 2015 3:07 AM | Updated on Sep 3 2017 2:49 PM

వచ్చే ఏడాది హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) డైరెక్టర్‌గా స్వీడన్‌కు చెందిన జార్న్ ఐస్‌బెర్గ్ కొనసాగనున్నారు.

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) డైరెక్టర్‌గా స్వీడన్‌కు చెందిన జార్న్ ఐస్‌బెర్గ్ కొనసాగనున్నారు. అంపైర్స్ మేనేజర్‌గా ఆండీ మేయిర్ పేరును ప్రతిపాదించారు. ఈ మేరకు ఈ ఇద్దరి నియామాకాన్ని లీగ్ నిర్వాహకులు బుధవారం ఖరారు చేశారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఆరు నగరాల్లో జరగనుంది. 2008, 2012 ఒలింపిక్స్‌లో మేయిర్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వహించారు. రియో ఒలింపిక్స్‌లోనూ ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. లీడ్ అంపైర్స్ మేనేజర్‌గా క్రెయిగ్ గ్రిబ్లి (న్యూజిలాండ్) బాధ్యతలు తీసుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement