చైన్లతో ధావన్‌, హార్దిక్‌.. నోరెళ్లబెట్టిన భువీ

Bhuvneshwar Kumar shocks after watch Shikhar Hardik Pandya - Sakshi

మా ఇద్దరి చైన్లు చూసి భువీ నొరెళ్లబెట్టాడంటూ టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మెడలో వేసుకునే లావైన చైన్లను పోలుస్తూ శిఖర్‌ ధావన్‌ ఏకంగా ఓ పెద్ద చైన్‌ను మెడలో వేసుకుని సరదాగా ట్వీట్‌ చేశాడు. హార్దిక్‌ పాండ్యాను, తనను చూసి భువనేశ్వర్‌ నోరెళ్లబెట్టాడంటూ ధావన్‌ ట్వీట్‌ చేశాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా ధావన్‌ ఎడమ బొటన వేలికి గాయమైన విషయం తెలిసిందే. గాయంతోనే ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన గబ్బర్‌కు మ్యాచ్‌ అనంతరం పరీక్షలు నిర్వహించగా బొటన వేలు విరిగిందని మూడు వారాల విశ్రాంతి అవసరమని తేలింది. దీంతో ప్రపంచకప్‌లోని ఇతర మ్యాచ్‌లకు గబ్బర్‌ దూరయ్యాడు.

అయితే ఇలా ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌కు అర్థాంతరంగా దూరమవడంతో ధవన్‌లో మరింత కసి పెరిగింది. శారీరకంగా, మానసికంగా తనను తాను పటిష్టంగా ఉంచుకోవడానికి శిఖర్‌ ధావన్‌ ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. గాయంపై శిఖర్‌ ధావన్‌ తన ప్రతిస్పందనను ప్రఖ్యాత ఉర్దూ రచయిత రాహత్‌ ఇందోరీ రాసిన కవితా రూపంలో వెల్లడించడం, గాయం తగ్గకపోయినా జిమ్‌లో తీవ్ర కసరత్తులు చేయడం చూస్తుంటే జట్టులోకి రావాడానికి గబ్బర్‌ ఎంతలా ప్రయత్నిస్తున్నాడో అర్థమవుతుంది. ఇక ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా మానసిక ప్రశాంతత కోసం తన సహచరులను ఆటపట్టిస్తూ గబ్బర్‌ ట్వీట్‌ చేయడంతో.. త్వరగా కోలుకుని జట్టులోకి రావాలంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top