భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన ఘనత

Bhuvneshwar Kumar Becomes First Indian Pacer To Take Five wickets In T20Is - Sakshi

టీ20ల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత పేస్‌ బౌలర్‌

జోహన్నెస్‌బర్గ్‌ : టీమిండియా పేస్‌ బౌలర్‌, డెత్‌ ఓవర్స్‌ స్పెషలిస్టు భువనేశ్వర్‌ కుమార్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఐదు వికెట్లతో ప్రొటీస్‌ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే. ఈ ప్రదర్శన(5/24)తో టీ20ల్లోఐదు వికెట్లు పడగొట్టిన తొలి భారత్‌ పేస్‌ బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా అన్ని ఫార్మాట్లలో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లలో యుజువేంద్ర చహల్‌ ఒక్కడే ఐదు వికెట్లు సాధించగా భువీ రెండో బౌలర్‌గా రికార్డుకెక్కాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్(72) బ్యాటింగ్‌ దాటికి, కోహ్లి(26), పాండే(29)లు తోడవడంతో ఆతిథ్య జట్టుపై భారత్‌ 204 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ భారీ లక్ష్య చేధనకు దిగిన ప్రొటీస్‌ బ్యాట్స్‌మన్‌ను భువేశ్వర్‌ పెవిలియన్‌ చేర్చాడు. ముఖ్యంగా దాటిగా ఆడుతున్న ఓపెనర్‌ హెన్‌డ్రీక్స్‌(72) వికెట్‌ తీసి భారత విజయాన్నిసులవు చేశాడు. మ‍ధ్య మధ్యలో నకుల్‌ బాల్స్‌ వేస్తూ సఫారీ బ్యాట్స్‌మన్‌లను అయోమయానికి గురి చేశాడు.

వైవిధ్యం కనబర్చకపోతే కష్టం..
మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన భువీ మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. ‘ టీ20ల్లో ఐదు వికెట్లు తీయడం అద్బుతంగా ఉంది. నేను లైన్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేశాను. ఇది సమిష్టి ప్రదర్శన.. మ్యాచ్‌కు ముందే బౌలింగ్‌పై ప్రణాళికలు రచించాం. కఠిన పరిస్థితుల్లో బౌలింగ్‌ చేయడం ఎప్పుడు ఆస్వాదిస్తా. నకుల్‌ బాల్‌ వేయడంపై గత ఏడాది కాలంగా సాధన చేశా. ఈ రోజుల్లో బౌలింగ్‌లో వైవిధ్యం కనబర్చకపోతే వికెట్లు తీయడం చాలా కష్టం’  అని భువీ అభిప్రాయపడ్డాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top