క్వార్టర్స్‌లో భువన | Bhuvana in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో భువన

Mar 2 2017 12:01 AM | Updated on Sep 5 2017 4:56 AM

క్వార్టర్స్‌లో భువన

క్వార్టర్స్‌లో భువన

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి కాల్వ భువన క్వార్టర్‌ ఫైనల్లోకి

గ్వాలియర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి కాల్వ భువన క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో క్వాలిఫయర్‌ భువన 6–2, 6–3తో మూడో సీడ్, హైదరాబాద్‌కే చెందిన సౌజన్య భవిశెట్టిపై గెలిచింది.

ఇతర మ్యాచ్‌ల్లో ప్రాంజల 5–7, 6–7 (5/7)తో టాప్‌ సీడ్‌ ఫాత్మా అల్‌ నభాని (ఒమన్‌) చేతిలో... పెద్దిరెడ్డి శ్రీవైష్ణవి రెడ్డి 1–6, 3–6తో మెహక్‌ జైన్‌ (భారత్‌) చేతిలో ఓడిపోయారు. డబుల్స్‌ క్వార్టర్స్‌లో నిధి చిలుముల–ప్రేరణ జంట 7–6 (7/4), 4–6, 10–6తో రష్మీ –ఇతీ మెహతా (భారత్‌) జోడీపై నెగ్గింది.
 

Advertisement
 
Advertisement
Advertisement