భారత బధిర టెన్నిస్‌ జట్టులో భవాని | Bhavani In Indian Tennis Team | Sakshi
Sakshi News home page

భారత బధిర టెన్నిస్‌ జట్టులో భవాని

Sep 6 2019 10:01 AM | Updated on Sep 6 2019 10:01 AM

Bhavani In Indian Tennis Team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టెన్నిస్‌ క్రీడలో నిలకడగా రాణిస్తోన్న తెలంగాణ అమ్మాయి భవాని కేడియా గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ప్రపంచ బధిర టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత లాన్‌ టెన్నిస్‌ జట్టుకు భవాని ఎంపికైంది. టర్కీలోని ఆంటాల్యాలో అక్టోబర్‌ 12 నుంచి 19 వరకు ప్రపంచ బధిర టెన్నిస్‌ చాంపియన్‌íÙప్‌ జరుగనుంది. జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంగా భవానిని ఆమె గురువులు, తల్లిదండ్రులు అభినందించారు.    

Advertisement
 
Advertisement
Advertisement