జర్మనీతో భారత్‌ కాంస్య పోరు | Sakshi
Sakshi News home page

జర్మనీతో భారత్‌ కాంస్య పోరు

Published Sun, Dec 10 2017 1:36 AM

Bharat Bronze Fighting with Germany - Sakshi

భువనేశ్వర్‌: సొంతగడ్డపై ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో కాంస్య పతకం నెగ్గాలంటే భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. మూడో స్థానం కోసం ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఒలింపిక్, ప్రపంచ మాజీ చాంపియన్‌ జర్మనీతో భారత్‌ తలపడుతుంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియా 3–0తో జర్మనీని ఓడించి నేడు జరిగే టైటిల్‌ పోరులో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది.

ఆస్ట్రేలియా తరఫున వూదెర్‌స్పూన్‌ (42వ ని.లో), జెరెమీ హేవార్డ్‌ (48వ ని.లో), టామ్‌ వికామ్‌ ఒక్కో గోల్‌ చేశారు. నలుగురు ఆటగాళ్లు జ్వరంతో బాధపడుతుండటంతో సెమీఫైనల్లో జర్మనీకి 13 మంది ఆటగాళ్లే అందుబాటులో ఉండటం గమనార్హం. లీగ్‌ దశలో జర్మనీ చేతిలో 0–2తో ఓడిపోయిన భారత్‌ ఈ కీలకపోరులో గెలిస్తే ప్రతీకారం తీర్చుకున్నట్టవుతుంది.  

►భారత్‌(vs) జర్మనీ సా.గం. 5.15 నుంచి
►అర్జెంటీనా(vs)ఆస్ట్రేలియారా.గం. 7.30 నుంచి 

Advertisement

తప్పక చదవండి

Advertisement