విశాఖలో కబడ్డీ సందడి | Bengaluru Bulls hold the Titans to a draw | Sakshi
Sakshi News home page

విశాఖలో కబడ్డీ సందడి

Aug 17 2014 1:06 AM | Updated on May 3 2018 3:17 PM

విశాఖలో కబడ్డీ సందడి - Sakshi

విశాఖలో కబడ్డీ సందడి

సాగర తీరాన కబడ్డీ సందడి మొదలైంది.

- తెలుగు టైటాన్స్, బెంగళూరు మ్యాచ్ డ్రా
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరాన కబడ్డీ సందడి మొదలైంది. ఇప్పటికే ఐదు వేదికల్లో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌కు శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు విశాఖపట్నంలో జరగనున్నాయి. స్థానిక పోర్ట్ ఇండోర్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ పోటీ పడ్డాయి. ఇరు జట్ల మధ్య జరిగిన హోరాహోరీ పోరుకు నిదర్శనంగా మ్యాచ్ 28-28 స్కోరుతో డ్రాగా ముగిసింది.

తెలుగు టైటాన్స్‌లో రాహుల్ చౌదరి అత్యధికంగా ఎనిమిది రైడ్ పాయింట్లు సాధించి ఆకట్టుకున్నాడు. సుకేష్ హెగ్డే 5 పాయింట్లు సాధించాడు. రాజగురు సుబ్రమణియన్ ప్రత్యర్థి ఆటగాళ్లను లాఘవంగా ఒడిసి పట్టుకుని జట్టు స్కోరును పెంచాడు. అటు బెంగళూరులో అజయ్ ఠాకూర్ అత్యధికంగా 12 రైడ్ పాయింట్లతో జోష్ కనబరిచాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ జట్టు 41-33తో బెంగాల్‌పై గెలిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement