బెంగళూరు బుల్స్ కు చుక్కెదురు | Bengal Warriors slay Bengaluru Bulls | Sakshi
Sakshi News home page

బెంగళూరు బుల్స్ కు చుక్కెదురు

Feb 5 2016 1:02 AM | Updated on Sep 3 2017 4:57 PM

సొంతగడ్డపై ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్‌కు షాక్ ఎదురైంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 24-34తో బెంగాల్ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది.

బెంగళూరు: సొంతగడ్డపై ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్‌కు షాక్ ఎదురైంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆ జట్టు 24-34తో బెంగాల్ వారియర్స్ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో ఓడి ఐదు పాయింట్లతో జాబితాలో ఏడో స్థానంలో నిలిచింది. బుల్స్ తరఫున అమిత్ రాఠి (6), సుర్జీత్ (5), సోమ్‌వీర్ (4) పాయింట్లు సాధించారు. నితిన్ తోమర్ (7), గిరిష్ మారుతి (4), నీలేష్ షిండే (3)లు వారియర్స్‌కు పాయింట్లు అందించారు. రైడింగ్‌లో అద్భుతమైన నైపుణ్యం చూపెట్టిన వారియర్స్....క్యాచింగ్‌లో కాస్త వెనుకబడింది. ఆట 32వ నిమిషం వరకు ఒక్క పాయింట్ (21-22) మాత్రమే వెనుకబడి ఉన్న బుల్స్ ఆ తర్వాత నిరాశపర్చింది. 8 నిమిషాల్లో ఏకంగా 12 పాయింట్లు సమర్పించుకుంది. శుక్రవారం జరిగే లీగ్ మ్యాచ్‌ల్లో దబాంగ్ ఢిల్లీతో యు ముంబా; బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.

Advertisement
 
Advertisement
Advertisement