క్వార్టర్స్‌లో సింధు పరాజయం | Sindhu loses in the quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు పరాజయం

Oct 10 2026 4:09 AM | Updated on Oct 10 2026 4:09 AM

Sindhu loses in the quarters

వాంటా (ఫిన్లాండ్‌): బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ ఆర్క్‌టిక్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు క్వార్టర్‌ ఫైనల్లో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్, టాప్‌ సీడ్‌ ఇంతనోన్‌ రచనోక్‌ (థాయిలాండ్‌) 21–11, 19–21, 21–18 స్కోరుతో ఆరో సీడ్‌ సింధుపై విజయం సాధించింది. 62 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తొలి సెట్‌లో పేలవ ప్రదర్శనతో ఓడిన సింధు కోలుకొని రెండో సెట్‌ను సొంతం చేసుకుంది.

అయితే చివరి సెట్‌లో మళ్లీ థాయ్‌ షట్లర్‌దే పైచేయి అయింది. ఈఓటమితో రచనోక్‌ చేతిలో సింధు పరాజయాల సంఖ్య 11కు చేరింది. ఆమెపై సింధు 4 సార్లు మాత్రమే గెలవగలిగింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో గరగ కృష్ణప్రసాద్‌ – పృథ్వీ కృష్ణమూర్తి రాయ్‌ ఓటమితో ఈ టోర్నీలో భారత పోరు ముగిసింది. కృష్ణప్రసాద్‌–పృథ్వీ 13–21, 14–21 తేడాతో డెన్మార్క్‌ జోడి క్రిస్టియాన్‌ ఫాస్ట్‌–రాస్మస్‌ చేతిలో పరాజయంపాలై నిష్క్రమించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement