సమావేశానికి రావాల్సిందే.. | BCCI's request to defer key meeting rejected by Supreme Court-appointed-Lodha panel | Sakshi
Sakshi News home page

సమావేశానికి రావాల్సిందే..

Aug 9 2016 2:23 AM | Updated on Sep 2 2018 5:24 PM

జస్టిస్ లోధా ప్యానెల్‌తో నేటి (మంగళవారం) సమావేశాన్ని వాయిదా వేయించేందుకు బీసీసీఐ చేసిన ప్రయత్నం విఫలమైంది.

బోర్డుకు తేల్చి చెప్పిన లోధా ప్యానెల్

 న్యూఢిల్లీ: జస్టిస్ లోధా ప్యానెల్‌తో నేటి (మంగళవారం) సమావేశాన్ని వాయిదా వేయించేందుకు బీసీసీఐ చేసిన ప్రయత్నం విఫలమైంది. సుప్రీం కోర్టు తీర్పుననుసరించి సంస్కరణల అమలుపై చర్చించేందుకు ఈనెల 9న బోర్డు.. లోధా ప్యానెల్‌తో సమావేశం కావాల్సి ఉంది. కానీ కార్యదర్శి అజయ్ షిర్కే సోమవారం రాత్రి కమిటీకి వాయిదా కోసం లేఖ రాశారు. అయితే ఈ మీటింగ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ వాయిదా వేయబోమని లోధా ప్యానెల్ స్పష్టం చేసింది. ఉదయం 11 గంటలలోపు బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, షిర్కే హాజరుకాకుంటే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని ప్యానెల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement