కట్నం కోసం భార్యను వేధిస్తున్న క్రికెటర్

bangladeshi cricketer Arafat Sunny accused of torturing wife and demanding dowry - Sakshi

ఢాకా:బంగ్లాదేశ్ క్రికెటర్ అరాఫత్ సన్నీ కథ మళ్లీ మొదటికొచ్చింది. వరకట్న వేధింపుల కేసులో ఇటీవలే జైలు నుంచి విడుదలై ఇంటివద్దనే ఉంటున్న అరాఫత్ భార్యను మళ్లీ వేధించడం ప్రారంభించాడు. అదనపు కట్నం తేవాలంటూ భార్య నస్రీన్ సుల్తానాను పదే పదే వేధించ సాగాడు. అందుకు తల్లి కూడా వంతపాడటంతో వేధింపులను తట్టుకోలేక నస్రీన్ సుల్తానా పోలీసుల్ని ఆశ్రయించింది.

2014 డిసెంబర్‌ 4న నస్రీన్‌ సుల్తానా తో సన్నీకి వివాహమైంది. అప్పుడు అతను 5.1 లక్షలు కట్నంగా అందుకున్నాడు. పెళ్లైన నాల్గో రోజునే ఆ కట్నాన్ని సన్నీకి అందజేశారు. వారి వివాహబంధం కొంతకాలం పాటు సాఫీగానే సాగింది. కాగా, 2015లో జూన్ 29 వ తేదీన మరో రూ. 20లక్షలు కట్నం తేవాలంటూ సన్నీ, అతని తల్లి వేధించసాగారు. ఇందుకు ఆమె ఒప్పకోలేదు. అదే సమయంలో ఈ ఏడాది జనవరి 5వ తేదీన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. దాంతో 22వ తేదీన సన్నీ అరెస్టయ్యాడు. ఆ వివాదాన్ని రాజీ చేసుకున్నామని సన్నీ భార్య కోర్టుకు తెలపడంతో అతడు విడుదలయ్యాడు. తాజాగా అతడు మరొకసారి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. మళ్లీ వివాదం మొదటికి రావడంతో అరాఫత్ కు కఠిన శిక్ష పడే అవకాశాలు కనబడుతున్నాయి.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top