రెండో ర్యాంక్‌లో రెజ్లర్‌ బజరంగ్‌ | Bajrang Punia placed No 2 in latest world rankings | Sakshi
Sakshi News home page

రెండో ర్యాంక్‌లో రెజ్లర్‌ బజరంగ్‌

Apr 2 2020 5:54 AM | Updated on Apr 2 2020 5:54 AM

Bajrang Punia placed No 2 in latest world rankings - Sakshi

బజరంగ్‌ పూనియా

న్యూఢిల్లీ: యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా రెండో ర్యాంక్‌లో నిలిచాడు. పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో బజరంగ్‌ 59 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. 60 పాయింట్లతో ఒలింపిక్‌ చాంపియన్‌ రషిదోవ్‌ (రష్యా) టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. దౌలత్‌ నియాజ్‌బెకోవ్‌ (కజకిస్తాన్‌–56 పాయింట్లు), ఇస్మాయిల్‌ ముస్జుకజెవ్‌ (హంగేరి–41 పాయింట్లు) వరుసగా మూడు, నాలుగు ర్యాంక్‌ల్లో ఉన్నారు. తాజా ర్యాంకింగ్‌ ప్రకారం ఈ నలుగురికి వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో టాప్‌–4లో సీడింగ్‌ లభించడం ఖాయమైంది. పురుషుల ఫ్రీస్టయిల్‌ 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన రవి దహియా 45 పాయింట్లతో నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. 86 కేజీల విభాగంలో దీపక్‌ పూనియా 54 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement