ఒత్తిడిని అధిగమిస్తా: అయోనికా పాల్ | Ayonika Paul gears up for Rio Olympics | Sakshi
Sakshi News home page

ఒత్తిడిని అధిగమిస్తా: అయోనికా పాల్

Jun 27 2016 7:57 PM | Updated on Sep 4 2017 3:33 AM

ఒత్తిడిని అధిగమిస్తా: అయోనికా పాల్

ఒత్తిడిని అధిగమిస్తా: అయోనికా పాల్

త్వరలో జరిగే రియో ఒలింపిక్స్ కు సన్నద్ధమవుతున్నట్లు భారత షూటర్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) అయోనికా పాల్ తెలిపింది.

ముంబై: త్వరలో జరిగే రియో ఒలింపిక్స్ కు  సన్నద్ధమవుతున్నట్లు భారత షూటర్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) అయోనికా పాల్ తెలిపింది. దీనిలోభాగంగానే తన సాంకేతికతకు మెరుగులు దిద్దుతున్నట్లు అయోనికా వెల్లడించింది. పలు దేశాల నుంచి పాల్గొనే ఆ మెగా ఈవెంట్లో ఒత్తిడి అధికంగా ఉంటుందని, అయితే దాన్ని అధిగమిస్తానని ఆశాభావం వ్యక్తం చేసింది. 'రియోకు కచ్చితమైన ప్రణాళికలతో సిద్ధమవుతున్నా. చదవడానికి ఏ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానో, అదే రకంగా రియోకు సన్నద్ధమవుతున్నా. నాకున్న కొద్దిపాటి అనుభవంతో ఒత్తిడిని అధిగమిస్తా. నాకు సాధారణంగా ఒత్తిడిలో ఆడటమంటే ఇష్టం. అంతకుముందు కూడా ఇదే తరహాలో ఒత్తిడిని జయించా. ప్రస్తుతం నా టెక్నిక్కు సానబడుతున్నాను' అని అయోనికా స్పష్టం చేసింది.

 

ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ రౌండ్లో అయోనికా రజతం సాధించి రియోకు అర్హత పొందింది. 2014 లో గ్లాస్కోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో కూడా అయోనికా రజతంతో మెరిసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement