తొలి వన్డే: భారత్‌పై ఆసీస్ విజయం | Australia won by 72 runs Against india | Sakshi
Sakshi News home page

తొలి వన్డే: భారత్‌పై ఆసీస్ విజయం

Oct 13 2013 8:59 PM | Updated on Sep 1 2017 11:38 PM

తొలి వన్డే: భారత్‌పై ఆసీస్ విజయం

తొలి వన్డే: భారత్‌పై ఆసీస్ విజయం

భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 72 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది.

పూణె: భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 72 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. ఆసీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే థావన్ (7) వికెట్టును కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లి , రోహిత్ శర్మకు జత కలిశాడు.  వీరివురూ బాధ్యాతయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. రోహిత్ (47) పరుగుల వద్ద తన వికెట్టును కోల్పోయాడు. అనంతరం కోహ్లి(61) కూడా పెవిలియన్ కు చేరడంతో భారత్ కష్టాల బాటపట్టింది. రైనా(39), యువరాజ్(7),ధోని(19), జడేజా(11) పరుగులకే అవుట్ కావడంతో భారత్ 49.4 ఓవర్లలో 232 పరుగులకే చాప చుట్టేసి ఓటమి పాలైంది. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్‌ను కట్టడి చేశారు.

 

తొలుత టాస్ గెలిచిన ఆసీస్  బ్యాటింగ్‌కు దిగింది.  ఓపెనర్లు హ్యూజెస్(47), ఫించ్(72) పరుగులతో మంచి  ఆరంభాన్ని ఇవ్వడంతో ఆసీస్ 304 పరుగుల భారీ స్కోరు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement