రాహుల్‌ ఫెయిల్‌.. మయాంక్‌ దూకుడు

Australia vs India, 4th Test Live Cricket Score - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 10 పరుగుల వద్ద తొలి వికెట్‌ నష్టపోయింది. ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్‌ (9) వైఫల్యాన్ని కొనసాగించాడు. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

మయాంక్‌ అగర్వాల్‌, చతేశ్వర్‌ పుజారా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును వంద పరుగులు దాటించారు. ఈ క్రమంలో మయాంక్‌ అర్ధసెంచరీ సాధించాడు. 96 బంతుల్లో 6 ఫోర్లతో అర్ధ శతకం పూర్తిచేశాడు. అతడికి సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా చక్కటి సహకారం అందించాడు. అర్ధ సెంచరీ చేసిన తర్వాత మయాంక్‌ దూకుడు పెంచాడు. లయన్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. చివరికి అతడి బౌలింగ్‌లోనే మయాంక్‌(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అవుటయ్యాడు. 161/2 స్కోరుతో టీమిండియా ఆట కొనసాగిస్తోంది. చతేశ్వర్‌ పుజారా (49), విరాట్‌ కోహ్లి(19) క్రీజ్‌లో ఉన్నారు.

భారత బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌, రవీంద్రన్‌ అశ్విన్‌లకు తుది జట్టులో స్థానం దక్కలేదు. ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారికి తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. (గెలిస్తే గొప్ప ఘనతవుతుంది!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top