రెండో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(46/2) | australia lose lose second wicket | Sakshi
Sakshi News home page

రెండో వికెట్ ను కోల్పోయిన ఆసీస్(46/2)

Jan 9 2015 10:14 AM | Updated on Sep 2 2017 7:27 PM

టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.

సిడ్నీ:టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా తన రెండో ఇన్నింగ్స్ లో 46 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.  శుక్రవారం రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించిన ఆసీస్ ఆదిలోనే వార్నర్ వికెట్ ను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్ ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో నిష్క్రమించాడు.

 

అనంతరం షేన్ వాట్సన్ (16) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ రెండు వికెట్లు అశ్విన్ కు లభించడం గమనార్హం. అంతకుముందు టీమిండియా 475 పరుగులకు ఆలౌటయిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement