పట్టుబిగించిన ఆసీస్‌ | Australia Is Heading Towards Victory In The Boxing Day Test | Sakshi
Sakshi News home page

పట్టుబిగించిన ఆసీస్‌

Dec 29 2019 5:56 AM | Updated on Dec 29 2019 5:56 AM

Australia Is Heading Towards Victory In The Boxing Day Test - Sakshi

మెల్‌బోర్న్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ‘బాక్సిం గ్‌ డే’ టెస్టులో ఆ్రస్టేలియా గెలుపు దిశగా పయనిస్తోంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. 456 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వేడ్‌ (15 బ్యాటిం గ్‌),  హెడ్‌ (12 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 44/2తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన న్యూజిలాండ్‌ను ప్యాట్‌ కమిన్స్‌ (5/28) దెబ్బ తీశాడు. దాంతో కివీస్‌ 54.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. 319 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన ఆస్ట్రేలియా ప్రత్యర్థి జట్టును ఫాలోఆన్‌ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని నిశ్చయించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement