యాషెస్‌ సిరీస్‌: రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం | Australia beat England by 120 runs to win second Test | Sakshi
Sakshi News home page

యాషెస్‌ సిరీస్‌: రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘనవిజయం

Dec 6 2017 11:13 AM | Updated on Dec 6 2017 11:15 AM

 Australia beat England by 120 runs to win second Test - Sakshi

అడిలైడ్‌ : యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో 5 మ్యాచుల సిరీస్‌లో 2-0తో స్మిత్‌ సేన  ఆధిక్యం సాధించింది. అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ మ్యాచ్‌లో విజయం ఆసీస్‌నే వరించింది. 442/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్‌ చేసిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 138 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 227 ఆలౌట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 233 పరుగులకు కుప్పకూలింది.

దీంతో ఆసీస్‌ 120 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ 138 పరుగులకే ఆలౌట్‌ కావడంతో ఇంగ్లండ్‌కు కేవలం 354 పరుగుల లక్ష్యమే ఏర్పడింది. కానీ  మిచెల్‌ స్టార్క్‌ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ విలవిలలాడారు. దీంతో ఆసీస్‌ విజయం సులువైంది. 

Advertisement
 
Advertisement
Advertisement