ఆసీస్‌కు వైట్‌వాష్‌ తప్పింది | australia beat by srilanka in last t-20 match | Sakshi
Sakshi News home page

ఆసీస్‌కు వైట్‌వాష్‌ తప్పింది

Feb 23 2017 1:02 AM | Updated on Oct 2 2018 4:31 PM

శ్రీలంకతో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది.

చివరి టి20లో లంకపై గెలుపు

అడిలైడ్‌: శ్రీలంకతో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు ఫాల్క్‌నర్‌ (3/20), జంపా (3/25) లంకేయుల్ని కట్టడి చేయడంతో ఆస్ట్రేలియా వైట్‌వాష్‌ నుంచి తప్పించుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 2–1తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేపట్టిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది.

ఓపెనర్లు క్లింగర్‌ (43 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ఫించ్‌ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. మలింగ, షణక చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18 ఓవర్లలో 146 పరుగుల వద్ద ఆలౌటైంది. సిరివర్ధన (35), మునవీర (37) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement