
నేపియర్: ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (116 బంతుల్లో 117 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ సెంచరీతో కడదాకా నిలిచి న్యూజిలాండ్‌ను గెలిపించాడు. బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. ముందుగా బంగ్లాదేశ్ 48.5 ఓవర్లలో 232 పరుగుల వద్ద ఆలౌటైంది. బౌల్ట్, సాన్‌ట్నర్ మూడేసి వికెట్లు, హెన్రీ, ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్ 44.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసి గెలిచింది. నికోల్స్ (53; 5 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 103 పరుగులు జోడించి శుభారంభమిచ్చిన గప్టిల్... టేలర్ (45 నాటౌట్, 6 ఫోర్లు)తో కలిసి 5.3 ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించాడు. శనివారం క్రైస్ట్‌చర్చ్‌లో రెండో వన్డే జరుగుతుంది.