
సాక్షి, హైదరాబాద్: ఎఎఫ్‌సీ గ్రాస్‌రూట్స్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆస్ట్రోపార్క్ అపోలో జట్టు సత్తా చాటింది. హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ ప్రాంగణంలో జరిగిన ఈ పోటీల్లో ఆస్ట్రోపార్క్ జట్టు 3 టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్–9, 11, 13 విభాగాల్లో ఆస్ట్రోపార్క్ జట్టు విజేతగా నిలిచింది. అండర్–9 ఫైనల్లో ఆస్ట్రోపార్క్ 1–0తో సెంట్రల్ పార్క్ (కొంపల్లి)పై నెగ్గగా... అండర్–11 విభాగంలో 4–0తో టర్ఫ్‌సైడ్ జూబ్లీహిల్స్ జట్టును ఓడించింది.
అండర్–13 కేటగిరీలో సెంట్రల్ పార్క్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. అండర్–15 కేటగిరీలో టర్ఫ్‌సైడ్ ‘ఎ’ జట్టు విజేతగా నిలిచి టైటిల్‌ను అందుకుంది. టర్ఫ్‌సైడ్ ‘బి’ జట్టు రన్నరప్‌లుగా నిలిచాయి. గ్రాస్‌రూట్స్ డే వేడుకల్లో 5 నుంచి 15 ఏళ్లలోపు వయస్సున్న వర్ధమాన ఫుట్‌బాలర్లు 100 మంది పాల్గొన్నారు.