‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ | ASIAN CHAMPS Finals – Sung snaps Korea’s title drought | Sakshi
Sakshi News home page

‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ

Apr 28 2014 1:31 AM | Updated on Sep 2 2017 6:36 AM

‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ

‘ఆసియా’ చాంప్స్ లిన్ డాన్, సుంగ్ జీ

ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో లిన్ డాన్ (చైనా), సుంగ్ జీ యున్ (కొరియా) విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో లిన్ డాన్ 14-21, 21-9, 21-15తో ససాకి షో (జపాన్)పై విజయం సాధించాడు.

గిమ్‌చియోన్ (కొరియా): ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ (ఏబీసీ)లో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాలలో లిన్ డాన్ (చైనా), సుంగ్ జీ యున్ (కొరియా) విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో లిన్ డాన్ 14-21, 21-9, 21-15తో ససాకి షో (జపాన్)పై విజయం సాధించాడు.
 
 గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించాక లిన్ డాన్ పాల్గొన్న టోర్నీ ఇదే కావడం విశేషం. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో నాలుగోసీడ్ సుంగ్ జీ యున్ (కొరియా) 21-19, 21-15తో షిజియాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో షిన్ బీక్ చోయెల్-యూ యోన్ సియోంగ్ (కొరియా); మహిళల డబుల్స్‌లో లూ యింగ్-లూ యు (చైనా); మిక్స్‌డ్ డబుల్స్‌లో లీ చున్ హె-చావు హో వా (హాంకాంగ్) జోడిలు టైటిల్స్ సాధించాయి. ఈ పోటీల్లో భారత్ నుంచి సింధు, జ్వాల-అశ్విని జోడికి కాంస్య పతకాలు లభించాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement