హవ్వా.. అదేం బౌలింగ్‌ అశ్విన్‌!

Ashwin Bizarre Bowling Action During Tamil Nadu League Match - Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో ‘మన్కడింగ్‌’తో వివాదం రేపిన ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరోసారి వార్తల్లో నిలిచాడు. వికెట్లు తీసేందుకు మైదానంలో రకరకాల విన్యాసాలు చేసే అశ్విన్‌.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌)లో కొత్త ట్రిక్‌తో క్రికెట్‌ అభిమానులను విస్మయానికి గురిచేశాడు. శుక్రవారం జరిగిన టీఎన్‌పీఎల్ ఓపెనింగ్‌ మ్యాచ్‌లో దిందిగల్‌ డ్రాగన్స్‌(డీడీ)తో చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో గిల్లీస్‌ టీమ్‌పై డ్రాగన్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ చివరి 2 బంతులకు 17 చేయాల్సివుండగా డీడీ కెప్టెన్‌ అశ్విన్‌ విచిత్రంగా బంతిని విసిరి అందరినీ ఆశ్చర్యంతో ముంచెత్తాడు. ముందు చేతిని ఉపయోగించకుండా, రాంగ్‌ ఫుట్‌తో అతడు బంతిని విసిరాడు. అశ్విన్‌ విన్యాసంపై సోషల్‌ మీడియాలో క్రికెట్‌ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతావా అంటూ ప్రశ్నిస్తున్నారు.

ముందుగా బ్యాటింగ్ చేసిన దిందిగల్‌ డ్రాగన్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 115 పరుగులు చేసింది. కెప్టెన్‌ అశ్విన్‌ 19 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 105 పరుగులే చేసింది. కాగా, ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో జోస్‌ బట్లర్‌ను కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేయడం తీవ్ర దుమారం రేపిన సంగతి క్రికెట్‌ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. (చదవండి: అశ్విన్‌ తప్పు చేశాడా!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top