నేను 8 వికెట్లు తీయలేనా..! 

Ashwin And Kumar Sangakkara Chit Chat About Muttiah Muralitharan Innings - Sakshi

కొలంబో: టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు (800) నెలకొల్పిన దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ తన ఆఖరి టెస్టులో ఈ ఘనత నమోదు చేసాడు. 2010లో స్వదేశంలో భారత్‌తో జరిగిన ఈ సిరీస్‌కు ముందే తాను మొదటి టెస్టు మాత్రమే ఆడి రిటైర్‌ అవుతానని అతను ముందే ప్రకటించాడు. అప్పటికి అతని ఖాతాలో 792 వికెట్లు ఉన్నాయి. అయితే సహచరుడు సంగక్కర మాత్రం 800 మైలురాయిని వచ్చేవరకు ఆడాల్సిందేనని ఒప్పించే ప్రయత్నం చేశాడు. అవసరమైతే తర్వాతి టెస్టునుంచి విశ్రాంతి తీసుకొని లేదా మరుసటి సిరీస్‌ అయినా ఆడాల్సిందే తప్ప ఇలా తప్పుకోవద్దని మళ్లీ మళ్లీ చెప్పాడు. దీనిపై స్పందించిన మురళీ...‘నేను నిజంగా అత్యుత్తమ స్పిన్నర్‌నే అయితే ఒకే టెస్టులో 8 వికెట్లు తీస్తాను తప్ప ఇలా సాగదీయను’ అని బదులిచ్చాడు. చివరకు అతను అన్నట్లుగానే సరిగ్గా 8 వికెట్లు తీసి చరిత్రలో తన పేరు లిఖించుకున్నాడు. గురువారం భారత స్పిన్నర్‌ అశ్విన్‌తో జరిపిన ఇన్‌స్టాగ్రామ్‌ సంభాషణలో సంగక్కర ఇది వెల్లడించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top