విజేత అరోరా డిగ్రీ కాలేజ్ | arora degree college wins inter college chess tourny | Sakshi
Sakshi News home page

విజేత అరోరా డిగ్రీ కాలేజ్

Sep 27 2016 12:18 PM | Updated on Sep 4 2017 3:14 PM

ఉస్మానియ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నమెంట్‌లో ఆతిథ్య అరోరా డిగ్రీ, పీజీ కాలేజ్ సత్తా చాటింది.

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నమెంట్‌లో ఆతిథ్య అరోరా డిగ్రీ, పీజీ కాలేజ్ సత్తా చాటింది. మొత్తం 36 కాలేజ్‌లు పోటీపడిన ఈ టోర్నమెంట్‌లో 11 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. 10 పాయింట్లు సాధించిన సీబీఐటీ కాలేజ్ ద్వితీయ స్థానాన్ని దక్కించుకోగా... ఎంజేసీఈటీ (9), ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్ (9)లు వరుసగా మూడు, నాలుగు స్థానాల్ని సంపాదించుకున్నాయి.

 

సీబీఐటీకి చెందిన యశోవర్ధన్ 5 పాయింట్లతో ‘బోర్డు విన్నర్’గా నిలవగా... ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్రీడాకారుడు దీప్తాంశ్ రెడ్డి ‘బోర్డు రన్నర్’గా నిలిచాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టోర్నమెంట్ చైర్మన్ బులుసు విశ్వానందం, సెక్రటరీ సునీల్ కుమార్, సీబీఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ శ్యామ్ మోహన్ రెడ్డి, ఎస్‌పీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్. హరినారాయణ రావు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement