హరికృష్ణకు మూడో ‘డ్రా’ | AP Grandmaster pentala Harikrishna Third 'draw' | Sakshi
Sakshi News home page

హరికృష్ణకు మూడో ‘డ్రా’

Feb 3 2016 1:05 AM | Updated on Mar 28 2019 5:32 PM

జిబ్రాల్టర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు.

న్యూఢిల్లీ: జిబ్రాల్టర్ చెస్ ఫెస్టివల్ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. బ్రుజోన్ బాటిస్టా లాజరో (క్యూబా)తో జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో నల్లపావులతో ఆడిన హరికృష్ణ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఏడో రౌండ్ తర్వా త హరికృష్ణ 5.5 పాయింట్లతో మరో 15 మందితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరోగ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక ఖాతాలో కూడా మూడో ‘డ్రా’ చేరింది. లారెంట్ ఫ్రాసినెట్ (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌ను హారిక 30 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు రెండో ఓటమి ఎదురైంది. బెంజమిన్ గ్లెడూరా (హంగేరి)తో జరిగిన గేమ్‌లో ఆనంద్ 48 ఎత్తుల్లో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement