తప్పులో కాలేసిన అనిల్ కుంబ్లే | Anil Kumble congratulates wrong Sagarika | Sakshi
Sakshi News home page

తప్పులో కాలేసిన అనిల్ కుంబ్లే

Apr 25 2017 4:33 PM | Updated on Sep 5 2017 9:40 AM

తప్పులో కాలేసిన అనిల్ కుంబ్లే

తప్పులో కాలేసిన అనిల్ కుంబ్లే

భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ త్వరలో ఓ ఇంటివాడు కానున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ :
భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టు కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ త్వరలో ఓ ఇంటివాడు కానున్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు, బాలీవుడ్‌ నటి సాగరిక ఘాట్గెతో జహీర్‌ నిశ్చితార్థం సోమవారం జరిగింది. సాధారణంగానే ప్రముఖ క్రికెటర్ కావడంతో జహీర్కు పెద్ద మొత్తంలో శుభాకాంక్షలు అందాయి. అయితే జహీర్తో పాటూ అతనికి కాబోయే భార్యకు కూడా ట్విట్టర్లో జహీర్ అభిమానులు, పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇక్కడే మాజీ ప్రముఖ క్రికెటర్, ప్రస్తుత భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే పప్పులో కాలేశారు.  సాగరిక ఘాట్గెకి విష్ చేయబోయి ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్కి శుభాకాంక్షలు తెలిపారు.

సాగరికా ఘోష్, సాగరిక ఘాట్గె పేర్లు ఒకేలా ఉండటంతో ఈ పొరపాటు జరిగింది. అయితే కొద్దిసేపటికే అసలు విషయం తెలుసుకున్న కుంబ్లే వెంటనే తన ట్విట్ని తొలగించి, మరో ట్విట్ చేశారు. అందులో సాగరికా ఘోష్ను ట్యాగ్ చేసిన స్థానంలో సాగరిక ఘాట్గెను ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు.

అయితే ఒక్క అనిల్ కుంబ్లేనే కాకుండా ఇంకా చాలా మంది సాగరికా ఘోష్కు విషెస్ చెబుతూ ట్విట్టర్లో పోస్టులు పెట్టారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి పంపిన విషెస్ కూడా సాగరిక ఘోష్కే చేరాయి.  పెద్ద ఎత్తున పెళ్లి శుభాకాంక్షలు రావడంతో జర్నలిస్ట్ సాగరిక ఘోష్ అవాక్కయ్యారు. అయ్యో సార్ నేను ఇద్దరు పిల్లల తల్లిని. మీరు తప్పు సాగరికాకి మీ విషెస్ పంపారు.. అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement