అంగద్‌ ‘పసిడి’ గురి | Angad Vir Singh Bajwa shoots historic skeet gold at Asian Championship | Sakshi
Sakshi News home page

అంగద్‌ ‘పసిడి’ గురి

Nov 7 2018 1:29 AM | Updated on Nov 7 2018 1:29 AM

Angad Vir Singh Bajwa shoots historic skeet gold at Asian Championship - Sakshi

కువైట్‌ సిటీ: ఆసియా షాట్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌ షిప్‌లో భారత యువ షూటర్‌ అంగద్‌ వీర్‌ సింగ్‌ బాజ్వా మెరిశాడు. ఈ మెగా ఈవెంట్‌లో 23 ఏళ్ల అంగద్‌ పురుషుల స్కీట్‌ విభాగంలో ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రపంచస్థాయిలో స్కీట్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారతీయ షూటర్‌గా గుర్తింపు పొందాడు. మంగళవారం జరిగిన ఫైనల్లో అంగద్‌ నిర్ణీత 60 పాయింట్లకుగాను 60 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

గతంలో 59 పాయింట్లతో బెన్‌ లెవిలిన్‌ (బ్రిటన్‌), రికార్డో ఫ్లిపెల్లి (ఇటలీ), విన్సెంట్‌ హాన్‌కాక్‌ (అమెరికా), ఆడమ్స్‌ పాల్‌ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అంగద్‌ తిరగరాశాడు. డి జిన్‌ (చైనా–58 పాయింట్లు) రజతం, సయీద్‌ అల్‌ మక్తూమ్‌ (యూఏఈ–46 పాయింట్లు) కాంస్యం గెలిచారు. క్వాలిఫయింగ్‌లో 121 పాయింట్లు సాధించిన అంగద్‌ మరో ముగ్గురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఇదే చాంపియన్‌షిప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ జూనియర్‌ ఈవెంట్‌లో ఇలవెనిల్‌ వలారివాన్‌–హృదయ్‌ హజరికా (భారత్‌) జోడీ స్వర్ణం...    మెహులీ ఘోష్‌–అర్జున్‌ బబూటా (భారత్‌) జంట కాంస్యం సాధించాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement