రన్నరప్ ఆంధ్రప్రదేశ్ | Andhra pradesh Runner up in weight lifting championship | Sakshi
Sakshi News home page

రన్నరప్ ఆంధ్రప్రదేశ్

Dec 26 2013 12:55 AM | Updated on Jun 2 2018 5:38 PM

ఆంధ్రప్రదేశ్ జట్టు - Sakshi

ఆంధ్రప్రదేశ్ జట్టు

జాతీయ యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ ఓవరాల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఏపీ టీమ్ మొత్తం 670 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది.

గువహటి: జాతీయ యూత్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ ఓవరాల్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఏపీ టీమ్ మొత్తం 670 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. మణిపూర్ (748 పాయింట్లు) ఓవరాల్ విజేతగా నిలిచింది. ఈ జాతీయ చాంపియన్‌షిప్‌లో యూత్ విభాగం పోటీలు ముగిశాయి.
 
 బుధవారం జరిగిన బాలుర 94 ప్లస్ కిలోల కేటగిరీలో ఏపీకి చెందిన బి. విష్ణువర్ధన్ 2 రజతాలు, 1 కాంస్యం గెలుచుకున్నాడు. స్నాచ్‌లో 111 కేజీల బరువు ఎత్తి రజతం నెగ్గిన అతను,  క్లీన్ అండ్ జర్క్‌లో 141 కిలోల బరువు ఎత్తి మరో రజతం సాధించాడు. ఓవరాల్‌గా 252 కేజీల బరువుతో విష్ణుకు కాంస్యం దక్కింది. యూత్ బాలుర విభాగంలో రాష్ట్రానికే చెందిన రాగాల వెంకట్ రాహుల్ ‘బెస్ట్ లిఫ్టర్’ అవార్డు అందుకున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement