ధనంజయపై నిషేధం

Akila Dananjaya banned from bowling for one year - Sakshi

దుబాయ్‌: శ్రీలంక ఆఫ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అకిల ధనంజయపై అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఏడాది నిషేధం విధించింది. అనుమానాస్పద బౌలింగ్‌ శైలే దీనికి కారణమని పేర్కొంది. స్వతంత్ర విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది.  గత నెలలో న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అనంతరం  సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆగస్టు 29న చెన్నైలో విచారణకు హాజరయ్యాడు.  అందులోనూ సందేహాస్పదంగా తేలడంతో నిషేధం తప్పలేదు. గతేడాది నవంబర్‌లోనే ధనంజయ సస్పెన్షన్‌ను ఎదుర్కొన్నాడు. లోపాలను దిద్దుకోవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో దానిని ఎత్తివేశారు. రెండేళ్ల వ్యవధిలో యాక్షన్‌పై రెండుసార్లు సందేహాలు రావడంతో నిషేధం తప్పనిసరైంది. ఈ గడువు తర్వాత తన బౌలింగ్‌ శైలి పరిశీలనపై ధనంజయ ఐసీసీని ఆశ్రయించవచ్చు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top