అఫ్గానిస్తాన్‌ మరో టీ20 వరల్డ్‌ రికార్డు | Afghan Set T20I World Record With Win Over Bangladesh | Sakshi
Sakshi News home page

అఫ్గానిస్తాన్‌ మరో టీ20 వరల్డ్‌ రికార్డు

Sep 16 2019 1:30 PM | Updated on Sep 16 2019 1:31 PM

Afghan Set T20I World Record With Win Over Bangladesh - Sakshi

ఢాకా:  పొట్టి ఫార్మాట్‌లో అఫ్గానిస్తాన్‌ తనదైన ముద్రను కొనసాగిస్తోంది. 2016-17 సీజన్‌లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్‌.. తాజాగా తన రికార్డునే తానే బ్రేక్‌ చేసుకుంది. గతంలో టీ20 ఫార్మాట్‌లో అఫ్గానిస్తాన్‌ 11 వరుస విజయాలు నమోదు చేసింది. ఇప్పుడు వరుసగా 12వ విజయాన్ని సాధించి గత రికార్డును సవరించింది. 2018 ఫిబ్రవరిలో అంతర్జాతీయ టీ20ల్లో మరోసారి జైత్రయాత్రను ఆరంభించిన అఫ్గానిస్తాన్‌ ఇప్పటివరకూ ఓటమి లేకుండా దూసుకుపోతుంది. ట్రై టీ20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్‌ విజయం సాధించడం ద్వారా వరుస అత్యధిక విజయాల రికార్డును లిఖించింది.

నిన్న జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన  అఫ్గానిస్తాన్‌ ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేయగా, బంగ్లాదేశ్‌ 139 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. అఫ్గాన్‌ బ్యాటింగ్‌  నబీ అజేయంగా 84  పరుగులు చేయగా, బౌలింగ్‌లో ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. దాంతో అఫ్గానిస్తాన్‌ ఘన విజయాన్ని అందుకుంది. అంతకుముందు  జింబాబ్వేపై అఫ్గాన్‌ 28 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.(ఇక్కడ చదవండి: బంగ్లాదేశ్‌కు అఫ్గానిస్తాన్‌ షాక్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement