బంగ్లాదేశ్‌కు అఫ్గానిస్తాన్‌ షాక్‌

Afghanistan Won by 25 Runs Against Bangladesh - Sakshi

ఢాకా: అఫ్గానిస్తాన్‌ పొట్టి ఫార్మాట్‌లో అసలు ఆగడ మే లేదు. విజయాలతో దూసుకెళుతోంది. ముక్కోణపు టి20 సిరీస్‌లో ఆదివారం అఫ్గాన్‌ 25 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలిచింది. వారికి ఇది వరుసగా 12వ విజయం. మొదట అఫ్గాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. నబీ (54 బంతుల్లో 84 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్స్‌ లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సైఫుద్దీన్‌ 4 వికెట్లు తీశాడు. తర్వాత బంగ్లా 19.5 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. మహ్ముదుల్లా (44; 5 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ముజీబుర్‌ రహా్మన్‌ 4, ఫరీద్, రషీద్‌ ఖాన్, నైబ్‌ తలా 2 వికెట్లు తీశారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top