‘సాయ్‌’ సభ్యురాలిగా జ్వాల | ace-shuttler-jwala-gutta-appointed-as-member-of-sai-governing-body | Sakshi
Sakshi News home page

‘సాయ్‌’ సభ్యురాలిగా జ్వాల

Mar 16 2017 3:08 PM | Updated on Sep 5 2017 6:16 AM

‘సాయ్‌’ సభ్యురాలిగా జ్వాల

‘సాయ్‌’ సభ్యురాలిగా జ్వాల

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఏఐ) పాలక మండలి సభ్యురాలిగా నియమితురాలయ్యారు.

న్యూఢిల్లీ: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఏఐ) పాలక మండలి సభ్యురాలిగా నియమితురాలయ్యారు. 14 సార్లు జాతీయ ఛాంపియన్‌ అయిన జ్వాల డబుల్స్‌లో సత్తా చాటుతోంది. దేశంలో బ్యాడ్మింటన్‌ అభివృద్ధికి ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుందని సాయ్‌ కార్యదర్శి ఎస్‌.ఎస్‌.ఛాబ్రా తెలిపారు. కాగా  ఈ నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, ‘సాయ్‌’  అధికారులు రెండు రోజుల క్రితం తనకు ఫోన్‌ చేసి ఈ విషయం తెలిపారని జ్వాల వెల్లడించారు.
 
సాయ్‌లో తన విధులు, బాధ్యతలు ఇంకా స్పష్టం కానప్పటికీ ఈ నెల 28 వ తేదీన ఢిల్లీలో ‘సాయ్‌’తో తన మొదటి సమావేశం ఉంటుందని వివరించారు. దేశంలో బ్యాడ్మింటన్‌ రంగం అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. కాగా, 2010 ఢిల్లీ ఏషియన్‌ గేమ్స్‌సిల్వర్‌ మెడల్‌తో పాటు 2011 ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో రజతం సాధించిన గుత్తా జ్వాల దేశం తరఫున ఒలింపిక్స్‌లో రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement