పీఎస్‌ఎల్‌లో డివిలియర్స్‌

 AB de Villiers set to feature in PSL 2019 - Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్‌ ఐదు నెలల కిందట ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అయితే, ఆ తర్వాత తాను మళ్లీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టే విషయంపై స్పష్టతనివ్వలేదు.

ఇటీవలే వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో తాను ఆడనున్నట్లు తెలిపాడు. తాజాగా మరో టీ20 లీగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆధ్వర్యంలో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో పాల్గొనేందుకు డివిలియర్స్ సిద్ధమయ్యాడు.

వచ్చే ఏడాది జరగనున్న సీజన్‌లో తాను అరంగేట్రం చేయబోతున్నానని 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ 2019 ఫిబ్రవరిలో జరిగే పీఎస్‌ఎల్‌లో తాను భాగస్వామ్యం కాబోతున్నట్లు చెప్పాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top