దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్గా ఏబీ | AB de Villiers appointed South Africa's Test captain | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్గా ఏబీ

Jan 29 2016 8:16 PM | Updated on Sep 3 2017 4:34 PM

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్గా ఏబీ

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్గా ఏబీ

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ నియమించబడ్డాడు.

కేప్ టౌన్: దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా  స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ నియమించబడ్డాడు.  ఈ మేరకు ఏబీని టెస్టు కెప్టెన్ గా నియమిస్తున్నట్టు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) తాజాగా స్పష్టం చేసింది. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన చివరి రెండు టెస్టులకు హషీమ్ ఆమ్లా కెప్టెన్సీ నుంచి వైదొలగడం తో ఆ బాధ్యతను తాత్కాలికంగా డివిలియర్స్ కు అప్పగించిన సంగతి తెలిసిందే.  కాగా, జాతీయ సెలక్టర్లు అభిప్రాయంతో ఏబీని టెస్టు కెప్టెన్ గా నియమిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు  నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వన్డే సారథిగా ఉన్నా ఏబీని టెస్టు కెప్టెన్ గా నియమించడం పట్ల సీఎస్ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హారూన్ లోర్గాట్ హర్షం వ్యక్తం చేశారు.

 

ఏబీ మంచి క్రికెటరే కాకుండా, విభిన్నమైన ఆటగాడు. సఫారీ జట్టును  సరైన దిశలో నడిపించే నాయకుడు. ఏబీ నాయకత్వంలో దక్షిణాఫ్రికా మరింత ఎత్తుకు ఎదుగుతుంది' లోర్గాట్ తెలిపారు. ఈ సందర్భంగా హషీమ్ ఆమ్లా నాయకుడిగా చేసిన సేవలను లోర్గాట్ కొనియాడారు. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్సీ పగ్గాలను ఆమ్లా చేపట్టే నాటికి జట్టు కష్టకాలంలో ఉన్నా అతడు ముందుండి నడిపించడంలో సఫలమయ్యాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement