6, 6, 6, 6.. వాట్ ఏ ఛేజ్..! | 6,6,6,6.. what a chase, shane warne Congrats West Indies | Sakshi
Sakshi News home page

6, 6, 6, 6.. వాట్ ఏ ఛేజ్..!

Apr 4 2016 9:28 AM | Updated on Sep 3 2017 9:12 PM

6, 6, 6, 6.. వాట్ ఏ ఛేజ్..!

6, 6, 6, 6.. వాట్ ఏ ఛేజ్..!

వరుసగా 6, 6, 6, 6 బాది మ్యాచ్ను ముగించడాన్ని గతంలో చూడలేదంటూ ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్.. టి-20 ప్రపంచ కప్ విజేత్ వెస్టిండీస్కు అభినందనలు తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్తో ఉన్న 25 ఏళ్ల అనుబంధంలో ఎన్నో అద్భుతమైన క్షణాల్ని ఆస్వాదించానని, అయితే వరుసగా 6, 6, 6, 6 బాది మ్యాచ్ను ముగించడాన్ని గతంలో చూడలేదంటూ ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్.. టి-20 ప్రపంచ కప్ విజేత్ వెస్టిండీస్కు అభినందనలు తెలిపాడు. వాట్ ఏ ఛేజ్ అంటూ వార్న్ ట్వీట్ చేశాడు. ఆదివారం రాత్రి ఇంగ్లండ్పై కరీబియన్లు విజయం సాధించాక ట్విట్టర్లో అభినందనలు వెల్లువెత్తాయి. చివరి ఓవర్లో విండీస్ బ్యాట్స్ మన్ బ్రాత్వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది జట్టుకు అద్భుత విజయాన్నందించిన సంగతి తెలిసిందే.

విండీస్కు అభినందనలు. ఇది నమ్మశక్యంగాని విజయం. అద్బుతంగా ఆడారు - విరాట్ కోహ్లీ
వరుసగా నాలుగు సిక్సర్లతో మ్యాచ్ ముగించడం అద్బుతం. కరీబియన్లకు అభినందనలు- రాస్ టేలర్


 

Advertisement
 
Advertisement
Advertisement