మన్‌ప్రీత్‌కు పగ్గాలు 

18-member Indian Men's Hockey Team for Asian Champions Trophy - Sakshi

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీకి భారత హాకీ జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత నిరాశాజనక ప్రదర్శనకు కెప్టెన్‌ పీఆర్‌ శ్రీజేష్‌ మూల్యం చెల్లించుకున్నాడు. ఏషియాడ్‌లో స్వర్ణం సాధించి 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని జారవిడుచుకున్న భారత్‌... చివరకు కాంస్యంతోనే సరిపెట్టుకుంది. దాంతో వచ్చే నెలలో జరిగే ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టు సారథ్య బాధ్యతల నుంచి గోల్‌కీపర్‌ శ్రీజేష్‌ను తప్పించారు. శ్రీజేష్‌ స్థానంలో మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అక్టోబరు 18 నుంచి మస్కట్‌లో జరిగే ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌తోపాటు పాకిస్తాన్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్, ఒమన్‌ పాల్గొంటాయి. 18 మంది సభ్యులుగల భారత జట్టులో 20 ఏళ్ల హార్దిక్‌ సింగ్‌కు తొలిసారి స్థానం లభించింది. చింగ్లేన్‌సనా సింగ్‌ను వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
  
భారత హాకీ జట్టు:
మన్‌ప్రీత్‌ సింగ్‌ (కెప్టెన్‌), చింగ్లేన్‌సనా సింగ్‌ (వైస్‌ కెప్టెన్‌), పీఆర్‌ శ్రీజేష్, కృషన్‌ బహదూర్‌ పాఠక్‌ (గోల్‌కీపర్లు), హర్మన్‌ప్రీత్‌ సింగ్, గురీందర్‌ సింగ్, కొతాజిత్‌ సింగ్, ఆకాశ్‌దీప్‌ సింగ్, గుర్జంత్‌ సింగ్, మన్‌దీప్‌ సింగ్, దిల్‌ప్రీత్‌ సింగ్, జర్మన్‌ప్రీత్‌ సింగ్, హార్దిక్‌ సింగ్, సురేంద్ర కుమార్, వరుణ్‌ కుమార్, సుమీత్, నీలకంఠ శర్మ, లలిత్‌ ఉపాధ్యాయ్‌.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top