టాపర్డర్‌ విఫలం..ఇంగ్లండ్‌ ఆలౌట్‌ | 153 runs england all out | Sakshi
Sakshi News home page

టాపర్డర్‌ విఫలం..ఇంగ్లండ్‌ ఆలౌట్‌

May 29 2017 6:22 PM | Updated on Sep 5 2017 12:17 PM

టాపర్డర్‌ విఫలం..ఇంగ్లండ్‌ ఆలౌట్‌

టాపర్డర్‌ విఫలం..ఇంగ్లండ్‌ ఆలౌట్‌

రబడా దాటికి కుప్పకూలిన ఇంగ్లండ్‌..

►రాణించిన రబడా, పార్నెల్‌, మహారాజ్‌

లండన్‌: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా లార్డ్స్ మైదానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ ఆర్డర్‌ చేతులెత్తేసింది. దక్షణాఫ్రికా బౌలర్ల దాటికి 31.1 ఓవర్లలో 153 పరుగులకే కుప్పకూలింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ కు దిగిన ఇంగ్లండ్‌ 20 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికా పేసర్లు రబడా, పార్నెల్‌, మహరాజ్‌లు విజృంభించడంతో ఇంగ్లండ్ టాపార్డర్ వరుస పెట్టి పెవిలియన్ కు క్యూకట్టేసింది. జాసన్ రాయ్(4), అలెక్స్ హేల్స్(1),జో రూట్(2), ఇయాన్ మోర్గాన్(8), బట్లర్(4),ఆదిల్ రషిద్(0)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ కు చేరారు.

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌ మెన్‌ లో బేర్‌ స్టో (8 ఫోర్లతో 51), విల్లి (26), చివర్లో రోలాండ్‌ జోన్స్‌ (5 ఫోర్లతో 37) రాణించడంతో ఇంగ్లండ్‌ 154 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడాకు(4) వికెట్లు దక్కగా, పార్నెల్‌, మహరాజ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. ఇప్పటికే సిరీస్ ను 2-0తో  ఇంగ్లండ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement