క్షమాపణలు చెప్పిన సెహ్వాగ్ | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 25 2018 12:54 PM

Virender Sehwag Apologises for Tweets A Controversy On Kerala Horror  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ట్వీటర్‌లో ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందించే భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఓ ట్వీట్ విషయంలో క్షమాపణలు చెప్పాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మతిస్థిమితం లేని కేరళ ఆదివాసి హత్యపై ఈ డాషింగ్‌ ఓపెనర్‌ స్పందించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పట్ల సిగ్గుతో తల దించుకుంటున్నానని శనివారం ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్‌లో ఉబెయిద్‌, హుస్సేన్‌, అబ్ధుల్‌ కరీం అని కొంత మంది నిందితుల పేర్లు ప్రస్తావించాడు. ఈ ట్వీట్‌ చేసిన 8 గంటలనంతరం 3వేల రిప్లేలొచ్చాయి. 16 మంది నిందుతుల్లో కేవలం ముస్లిం వర్గానికి చెందిన వారే కనిపించారా అని నెటిజన్లు సెహ్వాగ్‌ను ప్రశ్నించారు.    
ఈ కామెంట్లకు సెహ్వాగ్‌ క్షమాపణలు చెప్పాడు. ‘అసంపూర్తి సమాచారంతో నిందితుల అందరి పేర్లు ప్రస్తావించలేకపోయా. దీనికి బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. కానీ ట్వీట్‌ మతానికి సంబంధించినది కాదు. నిందితులు మతాల ద్వారా విభజించబడ్డారు. కానీ హింసాత్మక మనస్థత్వంలో ఐక్యంగానే ఉన్నారు. శాంతంగా ఉండండి అని ట్వీట్‌ చేశాడు.

దొంగతనం చేశాడంటూ మధు అనే 27 ఏళ్ల మతిస్థిమితంలేని ఆదివాసిని స్థానికులు దారుణంగా కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు 16 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పలు మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

Advertisement
Advertisement