ఫన్నీ వీడియో పోస్ట్‌ చేసిన సానియా మీర్జా

Sania Mirza TikTok About Waking Up Early - Sakshi

సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా చాలామంది ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా టిక్‌టాక్‌ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి సానియా టిక్‌టాక్‌ వాడుతున్నారు. బ్యూటీ ఫిల్టర్‌ నుంచి ప్లాంక్‌ చాలెంజ్‌ వరకు రకరకాల వీడియోలను ఇందులో పోస్ట్‌ చేశారు సానియా. వీటిలో కొన్ని లక్షల్లో వ్యూస్‌ సంపాదించాయి. తాజాగా సానియా టిక్‌టాక్‌లో పోస్ట్‌ చేసిన ఓ వీడియోను చూస్తే... ఆమెలో మంచి కమెడియన్‌ కూడా ఉందనిపిస్తుంది. 

ఈ వీడియోలో సానియా ఉదయాన్నే బాల్కనీలో నిల్చుని ఉంటుంది. ఆ సమయంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ఉద్దేశిస్తూ.. ఎందుకు అలా పరిగెడుతున్నావ్‌ ఎవరైనా తరుముతున్నారా.. అని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత తనలో తానే.. అరే ఉదయం ఏడు గంటలకు ఎవరైనా రోడ్డు మీదకు వస్తారా అంటూ అపనమ్మకం వ్యక్తం చేస్తుంది. ఈ వీడియోలో సానియా హావభావాలు మనకు నవ్వు తెప్పిస్తాయి. ఇప్పటికే వేలాది మంది ఈ వీడియోను వీక్షించారు. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top