ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌.. షాక్‌ అయిన జంట..! | Naked Man Photobomb While Pre Wedding Photoshoot At Beach | Sakshi
Sakshi News home page

అతన్ని చూసి బిత్తరపోయిన ప్రేమ జంట..!

Published Fri, May 3 2019 10:27 AM | Last Updated on Fri, May 3 2019 10:33 AM

Naked Man Photobomb While Pre Wedding Photoshoot At Beach - Sakshi

కాలిఫోర్నియా : బీచ్‌లో సరదాగా ఫొటోలు దిగుదామునుకున్న ఓ ప్రేమ జంటకు చేదు అనుభవం ఎదురైంది. వారు ఫొటోలకు పోజులిస్తున్న క్రమంలో ఓ వ్యక్తి నగ్నంగా దర్శనమివ్వడంతో ఆ జంట బిత్తరపోయింది.
కాలిఫోర్నియాకు చెందిన అమీ సెఫ్టాన్‌, జేక్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఫ్రీవెడ్డింగ్‌ ఫొటో షూట్‌ కోసం ఫొటో గ్రాఫర్‌ ఆస్టిన్‌ వైట్సెల్‌ను వెంటబెట్టుకుని సాన్‌ ఎలిజో స్టేట్‌ బీచ్‌కు వెళ్లారు. అయితే, ఆ ఫ్యామిలీ ఫ్రెండ్లీ
బీచ్‌లో ఓ పెద్దాయన నగ్నంగా వారి వెనకే నడుచుకుంటూ వెళ్లాడు. దీంతో ఫొటోలు తీస్తున్న వైట్సెల్‌తో పాటు అమీ, జెక్‌, అక్కడున్న మిగతా పర్యాటకులు నోరెళ్లబెట్టారు. 

‘ఈ ఫొటోలో మా వెనకాల నగ్నంగా ఓ పెద్దాయన కనిపిస్తున్నాడు కదా..!  కానీ, మా ముందు వందల కుటుంబాలున్నాయి. పిల్లలు, పెద్దలతో అక్కడ కోలాహలంగా ఉంది. అదొక ఫ్యామిలీ ఫ్రెండ్లీ బీచ్‌. అక్కడెవరూ కనీసం అలా తిరగరు’అని అమీ చెప్పుకొచ్చాడు. పెద్దాయన ఆకతాయి చేష్టల వల్ల వారు ఇబ్బంది పడినా ఎలాగోలా ఫోటో షూట్‌ కొనసాగించారు. చివర్లో బట్టలు వేసుకుని తిరిగొచ్చిన ఆ వ్యక్తితో కూడా ఫొటో దిగారు. అమీకి జెక్‌ ప్రపోజ్‌ చేసింది కూడా అదే బీచ్‌లో కావడం గమనార్హం. ఇప్పుడీ ఫన్నీ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement