‘అగ్ని దేవునికి కోపం వస్తే.. ఇలానే జరుగుతుంది’ | Gas Balloons Explode At Suttur Mutt in Mysore | Sakshi
Sakshi News home page

‘అగ్ని దేవునికి కోపం వస్తే.. ఇలానే జరుగుతుంది’

Feb 6 2019 9:02 AM | Updated on Feb 6 2019 11:47 AM

Gas Balloons Explode At Suttur Mutt in Mysore - Sakshi

బెంగళూరు : కర్ణాటకలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. మైసూరులోని సుత్తూర్‌ మఠ్‌లో కొన్ని రోజుల క్రితం హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంతవరకూ ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమంలో అనుకోని అపశృతి చోటు చేసుకుంది. హోమగుండాన్ని వెలిగించిన వెంటనే.. ఆ మంటలు కాస్తా అక్కడే ఉన్న బెలూన్‌లను తాకడం.. మంటలు చెలరేగడం వెంటవెంటనే జరిగిపోయింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఏఎన్‌ఐ షేర్‌ చేసిన ఈ వీడయో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ‘అదేమైన పుట్టిన రోజు వేడుక అనుకున్నారా.. బెలూన్లు కట్టారు’.. ‘అగ్ని దేవునికి కోపం వచ్చింది.. అందుకే ఇలా జరిగింది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement