వైరలవుతున్న అమెరికన్‌ సింగర్‌ ఫోటో

Anushka Sharma And American singer Julia Michaels Photos Goes Viral - Sakshi

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వింటుంటాం. కవలల విషయం వేరు. అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఇద్దరు మనుషులు ఒకేలా ఉండటం చాలా అరుదు. కొన్ని రోజుల క్రితం ఏపీ సీఎం చంద్రబాబును పోలిన ఓ వ్యక్తి ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను పోలిన ఓ యువతి ఫోటోలు కూడా తెగ వైరలవుతున్నాయి. అయితే అనుష్కను పోలిన వ్యక్తి కూడా ఓ సెలబ్రిటీనే కావడం ఇక్కడ మరింత విశేషం.

వివరాలు.. కొన్ని రోజుల క్రితం అమెరికన్‌ సింగర్‌ జూలియా మైకేల్స్ తన ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఈ ఫోటోలో జూలియాను చూసిన వారేవరైనా అనుష్క శర్మనే అనుకుంటారు. ఒక్క జుట్టు రంగు మినహాయిస్తే పూర్తిగా అనుష్కలానే ఉన్నారు జూలియా మైకేల్స్‌. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్‌ అవ్వడమే కాక  జూలియాను అనుష్క డూప్‌గా పోలుస్తున్నారు నెటిజన్లు. అంతేకాక ‘కోహ్లి.. వదిన పేరు మార్చుకుందా.. ఏంటి’ అని కామెంట్‌ చేస్తున్నారు.

Aus makin my hair extra floofy

A post shared by Julia Michaels (@juliamichaels) on

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top