బాల్యవివాహాన్ని అడ్డుకున్న చైల్డ్‌ లైన్‌ సిబ్బంది | Child line staff stop child marriage | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాన్ని అడ్డుకున్న చైల్డ్‌ లైన్‌ సిబ్బంది

Jan 21 2018 12:28 PM | Updated on Jan 21 2018 12:28 PM

దౌల్తాబాద్‌: మండలంలోని గుండేపల్లి గ్రామంలో శనివారం బాల్యవివాహాన్ని చైల్డ్‌ లైన్‌ సిబ్బంది అడ్డుకున్న సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... గుండేపల్లి గ్రామానికి చెందిన కోటకొండ నర్సప్ప (32) దామరగిద్ద మండలం విఠలాపూర్‌ గ్రామానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయితో శనివారం కర్నాటక రాష్ట్రం మోతక్‌పల్లి బలభీమసేన దేవాలయం దగ్గర వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.

 అయితే ఈ విషయం చైల్డ్‌ లైన్‌ సిబ్బందికి సమాచారం అందడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి పెళ్లిని నిలిపివేశారు. అనంతరం దౌల్తాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వారిని పిలిపించి ఎస్సై చంద్రశేఖర్‌ సమక్షంలో హమీ పత్రం రాసుకున్నారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్‌ కో–ఆర్డినేటర్‌ హన్మంత్‌రెడ్డి, ప్రసాద్‌ ఉన్నారు. బాల్యవివాహాలు జరిపితే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement