నేటి నుంచి జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ

ZPTC And MPTC Nomination Begins Today In AP - Sakshi

ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి

గ్రామాల్లో మొదలైన ఎన్నికల కోలాహలం

అధికార పార్టీ టిక్కెట్ల కోసం ఆశావహులు క్యూ..

సాక్షి, అమరావతి: నేటి నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లను స్వీకరించనున్నారు. 660 జడ్పీటీసీ, 9,984 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. జడ్పీటీసీ స్థానాలకు జడ్పీ కార్యాలయాల్లో, ఎంపీటీసీ స్థానాలకు ఎంపీడీవో కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 12న ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లు పరిశీలన.. 13న  నామినేషన్లపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. 14న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అనంతరం అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 21న ఎన్నికల పోలింగ్‌, 24న కౌంటింగ్‌ జరగనుంది. 30న జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నిక.. 30న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తారు. (విలువలు ప్రతిబింబించేలా ‘స్థానిక ఎన్నికలు’)

ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి..
స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగడంతో గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికార పార్టీ టిక్కెట్ల కోసం ఆశావహులు క్యూ కడుతున్నారు. గెలుపు గుర్రాల వేటలో ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎంపీడీవో, జడ్పీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు నేతలు వ్యూహరచన చేస్తున్నారు. (‘పుర’ పదవుల్లో మహిళలకే పెద్దపీట)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top