క్షీణించిన మేకపాటి ఆరోగ్యం... కొనసాగుతున్న సమర దీక్ష

YSRCP MPs Hunger Strike Reach 3rd Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్ర ప్రదేశ్‌ ప్రత్యేక హోదా సాధనకై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకి చేరుకుంది. ఏపీ భవన్‌లో నలుగురు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తుండగా.. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు లోను కావటంతో శనివారం ఆయన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తుండగా.. ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు. 

మరోవైపు హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఎంపీలకు మద్ధతుగా పార్టీ శ్రేణులు ఢిల్లీకి చేరుకుంటున్నాయి. ఏపీ భవన్‌ వద్దకు చేరుకుని ఎంపీలను పరామర్శిస్తూ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. మరోవైపు పలువురు జాతీయ పార్టీ నేతలు కూడా ఎంపీల దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇక రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ తరపున రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీకి విజయమ్మ...
వైఎస్సార్‌ సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు మద్ధతు తెలిపేందుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆదివారం ఢిల్లీకి వెళ్తున్నారు. దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలతోపాటు....అస్వస్థతకు గురై ఆస్పత్రిలో ఉన్న ఎంపీ మేకపాటిని ఆమె పరామర్శించనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top