‘30 సార్లు తిరిగి ఏం తీసుకొచ్చారు?’ | YSRCP MP Varaprasad Rao comments on chandrababu Delhi tour | Sakshi
Sakshi News home page

‘30 సార్లు తిరిగి ఏం తీసుకొచ్చారు?’

Apr 3 2018 11:18 AM | Updated on Mar 23 2019 9:10 PM

 YSRCP MP Varaprasad Rao comments on chandrababu Delhi tour - Sakshi

రాజకీయ లబ్ధి కోసమే సీఎం చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు.

సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసమే సీఎం చంద్రబాబు ఢిల్లీకి వస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వరప్రసాద్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 30 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు.

ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. మరో వైపు అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టే వరకు పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement