చంద్రబాబును ప్రజలు క్షమించరు!

YSRCP MLAS Fire on Chandrababu Naidu Over BC Commission Bill - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడిని ప్రజలు క్షమించబోరని వైఎస్సార్‌సీపీ సభ్యుడు చెల్లుబోయిన వేణుగోపాల్‌ అన్నారు. శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధి బీసీ కమిషన్‌ బిల్లు తీసుకురావడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ బిల్లును అడ్డుకోవడం టీడీపీకి తగదని హితవు పలికారు. బీసీలకు జరిగే మేలును టీడీపీ వినలేకపోతున్నారని తప్పుబట్టారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాటుపడ్డారని గుర్తు చేశారు. 

ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అనేక మంది పేద విద్యార్థులు బాగుపడిన విషయాన్ని గుర్తు చేశారు. బీసీల పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. మంజునాథ కమిషన్‌ చైర్మన్‌ను సైతం గౌరవించని మనస్తత్వం చంద్రబాబుదని వేణుగోపాల్‌ దుయ్యబట్టారు. ఐదేళ్లలో బీసీల కోసం టీడీపీ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. బీసీల రక్షణ కోసమే బీసీ కమిషన్‌ బిల్లును తీసుకొచ్చినట్టు వేణుగోపాల్‌ స్పష్టం చేశారు. బీసీల రక్షణ కోసమే బీసీ కమిషన్‌ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేని అంశాలను బీసీ కమిషన్‌ దృష్టికి తీసుకురావొచ్చునని పేర్కొన్నారు.

టీడీపీకి ఆ ఆలోచన ఎందుకు రాలేదు?
బీసీల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్‌ జగన్‌ కట్టుబడి ఉన్నారని వైఎస్సార్‌సీపీ సభ్యుడు కరణం ధర్మశ్రీ స్పష్టం చేశారు. శాశ్వత బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన టీడీపీకి ఎప్పుడైనా వచ్చిందా? అని ఆయన ప్రశ్నించారు. శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి టీడీపీ తూట్లు పొడిందని ధర్మశ్రీ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయడంతో అన్ని కులాలకూ ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు.

చంద్రబాబు బీసీలను నిర్లక్ష్యం చేశారని, దేశంలో మొదటిసారిగా శాశ్వత బీసీ కమిషన్‌ రాష్ట్రంలో ఏర్పాటయిందని అన్నారు. ఎన్నికల వస్తేనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకువస్తారని పేర్కొన్నారు. బీసీల కోసం ఒక్క పథకమైనా చంద్రబాబు అమలు చేశారా? అని ప్రశ్నించారు. బీసీలంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంట అని నిలదీశారు. బలహీన వర్గాలు బలపడాలనేదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని, బీసీ కమిషన్‌ బిల్లును అందరూ కచ్చితంగా సమర్థించాలని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top